దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 25,005కు చేరింది. సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 81,585 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 102.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.05 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం ముగియడం, చైనాలో పెరుగుతున్న ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్లు, జపాన్ మార్కెట్లు పుంజుకుంటుండడంతో దేశీయ మార్కెట్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు పడిపోవడం దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఒక సదావకాశమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి మార్కెట్లు పడినప్పుడు నిరాశ చెందుకుండా మంచి కంపెనీలు ఎంచుకుని అందుకు తగ్గట్టుగా మదుపు చేయాలని సూచిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment