దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 24,381కు చేరింది. సెన్సెక్స్ 126 పాయింట్లు నష్టపోయి 79,961 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.92 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1.6 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!
కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్..నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.25%), డాలర్ ఇండెక్సు 104.5 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment