భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 874.94 పాయింట్లు లేదా 1.11% పెరిగి 79,468.01 వద్ద, నిఫ్టీ 322.70 పాయింట్లు లేదా 1.34% ఎగిసి 24,315.25 స్థాయిలకు చేరుకున్నాయి.
నిఫ్టీ లిస్టింగ్‌లో ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, టైటాన్ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.
గడిచిన మూడు సెషన్‌ల్లో మార్కెట్ భారీగా పతనమైంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా వాటిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లోని ఒడిదొడుకులను ఒక అవకాశంగా తీసుకుని మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment