
స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఫైనాన్షియల్, టెలికాం స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడిల మధ్య గురువారం సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 55,990 వద్ద నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 16,656 వద్ద మిశ్రమ లాభాలతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. జైడుస్ వెల్ నెస్, అదానీ గ్రీన్, అదానీ గ్యాస్, శ్రీ రెన్,సుగ్, లక్ష్మీ మెషీన్,థర్మాక్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..భారతీ ఎయిర్ టెల్, ఎస్‌బీఐ షేర్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.
మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ అనుమతులు లభించడంతో పాటు జాక్సన్ హోల్ వార్షిక సమావేశం యూఎస్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై సానుకూల వ్యాఖ్యలు చేయవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment