![stock market updates on febraury 13 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/stock-market-gain.jpg.webp?itok=2LMHskW4)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 53 పాయింట్లు పెరిగి 23,101కు చేరింది. సెన్సెక్స్(Sensex) 188 పాయింట్లు ఎగబాకి 76,368 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు సెషన్లలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 107.83 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.27 శాతం పడిపోయింది. నాస్‌డాక్ 0.03 శాతం పెరిగింది.
విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలిస్తే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం
2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాలను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్‌తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చివరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment