ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా తమ ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించడానికి సన్నద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఎదిగిన టెస్లా కంపెనీలో 2023 డిసెంబర్ నాటికి 1,40,473 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల 14000 కంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉంది.
టెస్లా సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో.. ఇలాన్ మస్క్ (Elon Musk) ఇలా పేర్కొన్నారు.. కంపెనీ తదుపరి వృద్ధికి సిద్దమవుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉత్పాదకను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి మీద ద్వేషం లేదు, తప్పని పరిస్థితుల్లో చేస్తున్నామని అన్నారు.
కాలిఫోర్నియా, టెక్సాస్‌లోని కొంతమంది సిబ్బందికి ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. మరోవైపు గిగాఫ్యాక్టరీ షాంఘైలో టెస్లా సైబర్ ట్రక్ ఉత్పత్తి తగ్గించడం కూడా తాజాగా ఉద్యోగుల తొలగింపుకు కారణం అయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే..
టెస్లా షేర్లు ఇటీవలి బాగా దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే.. ఇది సుమారు 31 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ.. ఆ విభాగంలో ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. ఇది టెస్లా అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment