
ముంబై: బుల్ రంకెలు వేయడంతో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయి. బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఉదయం మొదలైన జోరు సాయంత్రం మార్కెట్ ముగిసే వరకు కొనసాగింది.
బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సూచీ జోరు తగ్గడం లేదు. ఆగస్టు మొదలైనప్పటి నుంచి సెన్సెక్స్ సూచీ పైకి చేరుకుంటూనే ఉంది. అదో ఊపులో శుక్రవారం యాభై ఐదు వేల మార్క్‌ని క్రాస్ చేసింది. ఈరోజు ఉదయం 54,91 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓ దశలో 55,847 పాయింట్లను తాకింది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 593 పాయింట్లు లాభపడి 55,437 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సైతం ఇదే జోరు కొనసాగించింది. ఈరోజు ఉదయం 16,385 పాయింట్లతో ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి 164 పాయింట్లు లాభపడి 16,529 పాయింట్లకు చేరుకుంది.
ఈరోజు బీఎస్‌సీ సెన్సెక్స్‌లో టాటా కన్సుమర్ ప్రొడక్ట్ షేర్లు అత్యధిక లాభం పొందగా ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ఐసీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలు పొందాయి. టెక్‌మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను చవి చూశాయి. బ్యాంక్ నిఫ్టీ అర శాతం పైకి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment