దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 520.55 పాయింట్ల లాభంతో 71868.20 వద్ద, నిఫ్టీ 158.90 పాయింట్ల లాభంతో 21716.70 వద్ద కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనూ ముందు వెళుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా పవర్ వంటి కంపెనీలు చేరాయి. ప్రధాన మంత్రి సోలార్ స్కీమ్ కారణంగా టాటా పవర్ ముందుకు దూసుకెళ్తోంది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్, IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, HDFC బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment