
న్యూఢిల్లీ: టర్మ్ లోన్ బి (టీఎల్‌బీ) న్యాయ వివాదంలో ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌కు అమెరికా కోర్టులో ఊరట లభించింది. బైజూస్ తమ అమెరికన్ అనుబంధ కంపెనీ నుంచి 500 మిలియన్ డాలర్ల నిధులను ఇతర సంస్థలకు మళ్లించడంపై విచారణ జరపాలంటూ టీఎల్‌బీ రుణదాతలు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
దీనిపై తదుపరి విచారణ చేయడానికి సంబంధించి రుణదాతలకు తగిన ప్రాతిపదిక లేదని డెలావేర్ కోర్టు వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1.2 బిలియన్ డాలర్ల టీఎల్‌బీ రుణాన్ని సత్వరం చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి తేవడంపై వివాదం తలెత్తడం, దీన్ని సవాల్ చేస్తూ బైజూస్ .. న్యూయార్క్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment