ప్రముఖ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ కలిసి 2019లో ఆల్కెమ్ ల్యాబ్స్ ఎండి సందీప్ సింగ్ స్థాపించిన గుడ్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ఇండియా(జీఎఫ్ఐ) మద్దతు గల బ్లూ ట్రైబ్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా వారు పేర్కొన్నారు. అలాగే, ఈ స్టార్టప్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా వీరిద్దరూ పనిచేయనున్నారు. మాంసంకృత్తులు అధిక స్థాయిలో గల మొక్కలతో తయారు చేసిన ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తుంది. మాంసం రుచి గల మొక్కలతో తయారు చేసిన మటన్ కీమా, సాసేజ్, మోమోలను ఈ స్టార్టప్ కంపెనీ విక్రయిస్తుంది.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొన్ని సంవత్సరాలుగా మాంస ఆహారాన్ని తినడం లేదని, కేవలం మాంసంకృత్తులు అధిక స్థాయిలో గల మొక్కలతో తయారు చేసిన తమ ఆహారాన్ని తింటున్నారని జీఎఫ్ఐ పేర్కొంది. "విరాట్, నేను ఎల్లప్పుడూ జంతు ప్రేమికులు. మేము మాంసం లేని జీవనశైలిని స్వీకరించాలని నిర్ణయించి సంవత్సరాలు అయింది. బ్లూ ట్రైబ్ సహకారం అందుకు సరిగ్గా దోహద పడింది" అని అనుష్క శర్మ అన్నారు. విరాట్ కోహ్లీ తాను ఆహార ప్రియులనని పేర్కొంది. మాంసాహారం లేకుండా మాంసాన్ని తిన్న అనుభూతినిచ్చేలా మొక్కలతో తయారు చేసిన ఆహారాన్ని బ్లూ ట్రైబ్ విక్రయిస్తుంది వారు పేర్కొన్నారు. స్మార్ట్ ప్రోటీన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 2020- 2021 మధ్య కాలంలో 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని జీఎఫ్ఐ పరిశోధనలో తేలింది. ఈ రంగంలో భారత దేశంలో పెట్టుబడులు వస్తున్నాయని జీఎఫ్ఐ పేర్కొంది.
Anushka and I are thrilled to join the #PlanetFriendlyTribe 🌍☘️
— Virat Kohli (@imVkohli) February 8, 2022
We all have the power to protect our planet. And @bluetribefoods's palate-friendly, planet-friendly alternatives are a great way to relish the experience of eating meat,without leaving an impact on the planet 💙 #ad pic.twitter.com/h8UGJTKjpf
(చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ గేమ్‌ని నిషేధించండి.. తెలంగాణ హైకోర్టులో పిల్)
Comments
Please login to add a commentAdd a comment