గ్రామీణ ప్రజలు చిన్న అనారోగ్యానికి కూడా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, పెద్దస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లనవసరం లేకుండా సొంతూరిలోనే వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజియన్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ పల్లె ఆరోగ్యానికి పట్టం కట్టింది. పేదలకు ఆరోగ్య భరోసాకల్పిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా కూడా సేవలు అందిస్తూ..ఫ్యామిలీ ఫిజిషియన్‌ను పటిష్టం చేస్తోంది. ప్రధానంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఎలాంటి శ్రమలేకుండా పల్లెల్లోనే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రజల వద్దకే పాలన అన్నట్లు.. ప్రజల వద్దకే వైద్య సేవలు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
– సాక్షి, తిరుపతి / చిత్తూరు రూరల్
పల్లె వైద్యం ఇలా...
● ఉదయం 9 గంటలకే హెల్త్ సెంటర్లకు చేరుకుని మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఊరు బాగోగులు, మంచం పట్టిన బాధితులకు ఆరోగ్య పరీక్షలు, సేవలు చేస్తూ సాయంత్రం 4 గంటలకు వరకు వైద్యులు పల్లెనాడి పడుతున్నారు.
● జనరల్ అవుట్ పేషెంట్‌లకు సేవలు
● బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జ బ్బుల కేసుల ఫాలోఅప్
● గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు
● చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు
● రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్యం
● వైఎస్సార్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసుకున్న రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం.
● పాలియేటివ్ కేర్
● తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌్ నిర్ధారణ
● ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు
● బీపీ, షుగర్లకు సైతం వైద్యపరీక్షలు.. ఉచితంగా మందులు
● పీహెచ్‌సీ లేదా టెలిమెడిసిన్ సెంటర్ వైద్యులకు ఫోన్ చేసి రోగులతో మాట్లాడించి చికిత్స
గతంలో ఇలా..
గతంలో ఏదైనా జబ్బు చేస్తే ముందుగా పీహెచ్‌సీకి వెళ్లేవారు. అక్కడి డాక్టర్లకు జబ్బు అర్థంకాకపోయినా, తీవ్రమైందిగా భావించినా జిల్లా కేంద్రంలో ని ఆస్పత్రికి పంపించేవారు. సబ్ సెంటర్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. అక్కడ ప్రాథమిక వైద్యం అందేది కాదు. జిల్లా ఆస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టేవారు. దీర్ఘ కాలిక వ్యాధులకు, ప్రసవ సేవల కోసం తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోనే వైద్యం చేయించుకోవాల్సి వచ్చేది.
రోగులకు చేస్తున్న పరీక్షలు
● గర్భ నిర్ధారణ టెస్ట్ ● హిమోగ్లోబిన్ టెస్ట్
● ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్)
● మలేరియా టెస్ట్ ● హెచ్‌ఐవీ నిర్ధారణ
● డెంగీ టెస్ట్
● మల్టీపారా యూరిన్‌స్ట్రిప్స్ (డిప్‌స్టిక్)
● అయోడిన్‌టెస్ట్ ● వాటర్ టెస్టింగ్
● హెపటైటిస్ బీ నిర్ధారణ
● ఫైలేరియాసిస్ టెస్ట్ ● సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్
● విజువల్ ఇన్‌సెక్షన్‌న్ ● స్పుటమ్ (ఏఎఫ్‌బీ)
Comments
Please login to add a commentAdd a comment