సమస్యలు ఆలకించండి సారూ!
● కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జేసీ విద్యాధరి ● వివిధ సమస్యలపై 167 అర్జీలు నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : ‘దూర ప్రాంతాల నుంచి విచ్చేశాం..మా సమస్యలు పరిశీలించి న్యాయం చేయండి.. సారూ’ అని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు అధికారులను వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందజేసిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు 167 అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్‌వో మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులు చేయండి
వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డును నిర్మించాలని శ్రీరంగరాజపురం మండలం ఉడమల కుర్తి వాసులు కోరారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు. శ్మశానవాటికకు దారి సౌకర్యం కల్పించాలన్నారు. తమ గ్రామానికి చెందిన చిన్నబక్కయ్య, ఆయన అనుచరులు జేసీబీతో శ్మశాన దారిని తవ్వేసి రాకపోకలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. న్యాయం చేయాలని కోరారు.
సమస్యలు ఆలకించండి సారూ!
Comments
Please login to add a commentAdd a comment