ఎస్బీఐ అకౌంట్‌లో నగదు మాయం
● ఆందోళనలో ఖాతాదారులు ● రుణాలు తీసుకున్న వారి డబ్బు మాయం
● మాయంపై విచారణ జరపాలి
రొంపిచెర్ల: స్థానిక భారతీయ స్టేట్ బ్యాంక్‌లో డబ్బులు మాయం అవుతున్నాయని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంక్ ఖాతాదారులందరికీ ఖాతాలో నగదు డ్రా అయినట్లు మేసేజ్‌లు రావడంతో ఖాతాదారులు బ్యాంక్‌కు పరుగులు తీస్తున్నారు. మండలంలోని దద్దాలవారిపల్లెకు చెందిన మహేష్ ఖాతాలో రూ.20.500, శివప్రసాద్ నాయుడు అకౌంట్‌లో రూ.8.555, ఫజులుపేటకు చెందిన జ్యోతిమ్మ ఖాతాలో రూ.9.555, మల్లికార్జున ఖాతాలో రూ.10 వేలు, రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు చెందిన మనోజ్ ఖాతాలో , రూ.3.600, నవీన్ ఖాతాలో రూ.3.800, కృష్ణమూర్తి ఖాతాలో రూ.6 వేలు మాయం అయినట్లు సోమవారం తెలిపారు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పే మాటలకు పోంతన లేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ ఖాతాలో డబ్బు తాము డ్రా చేయకనే ఎలా డ్రా అయిందని, ఎవరు డ్రా చేశారని, ఏ ఖాతాకు వెళ్లిందని బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని సులువుగా బ్యాంక్ అధికారులు తప్పుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంక్‌ల్లో రుణాల తీసుకుని సకాలంలో చెల్లించకపోతే అలస్యం రుసుం కింద డబ్బు డ్రా చేస్తారని బ్యాంకర్లు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులకు పూర్తి బాధ్యత బ్యాంక్ అధికారులదే. అయితే బ్యాంక్ ఖాతాలలో డబ్బును సైబర్ క్రైమ్‌లో డ్రా చేస్తే పూర్తి వివరాలను ఖాతాదారులకు ఇవ్వాలి. వారు పోలీసు స్టేషన్ల్‌లో కేసులు నమోదు చేస్తారు. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరి ఖాతాకు మళ్లీంచారనే విషయం కూడా తెలియడం లేదు. మినీ స్టే మెంట్లు తీసుకున్న చూపించడం లేదని బాధితులు వాపోతున్నారు. తాము ఎక్కడ రుణాలు తీసుకోకపోయినా తమ డబ్బులు మాయం అయ్యాయని బోరున విలపిస్తున్నారు. డబ్బులు మాయం అవుతుంది ఒక్క రొంపిచెర్ల స్టేట్‌బ్యాంక్‌లోనే అని ఖాతాదారులు ఆరోపించారు. బ్యాంక్‌లో డబ్బు డ్రా చేయకనే డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మేసేజ్‌లు రావడంతో ఖాతాదారులు బ్యాంక్‌కు పరుగులు తీస్తున్నారు. బాఽధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పుటికై న బ్యాంక్ అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేసి డబ్బు మాయంపై విచారణ జరపాలని ఖాతాదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment