కర్ణాటకలో చోరీ.. ఓజీకుప్పం వాసి అరెస్టు
రూ. 30 లక్షల నగదు స్వాధీనం
నగరి : కర్ణాటక, హవేరిలో రూ.30 లక్షలు చోరీ చేసిన సంఘటనలో ఓ వ్యక్తిని ఓజీ కుప్పం గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక, హవేరిలో రూ.30 లక్షలు చోరీ కేసులో నగరి మండలం ఓజీ కుప్పం వాసి నిందితుడిగా అక్కడి పోలీసులు గుర్తించారు. దీంతో వారు నగరి డీఎస్పీ సయ్యద్ అబ్దుల్ అజీజ్‌ను సంప్రదించారు. నగరి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన చోరీ కేసుల ఆధారంగా స్థానిక పోలీసుల సహకారంతో ఓజీకుప్పం గ్రామంలో దాడులు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు రోజులు గాలింపు చర్యలు చేపట్టి, చోరీకి పాల్పడిన జగదీష్(35) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని కర్ణాటక పోలీసులకు సోమవారం అప్పగించారు. నిందితుడిని గుర్తించడంలో సహకరించిన డీఎస్సీతోపాటు పోలీసులకు కర్ణాటక పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
కర్ణాటకలో చోరీ.. ఓజీకుప్పం వాసి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment