వైద్యవిధాన పరిషత్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్‌లోని ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్ ప్రభావతి తెలిపారు. పలు విభాగాల్లో మొత్తం 26 ఖాళీలున్నాయన్నారు. ల్యాబ్ అసిస్టెంట్ 1, రేడియోగ్రాఫర్ 2, బయోస్టేటిష్టియన్ 1, రికార్డ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అటెండెంట్ 1, థియేటర్ అసిస్టెంట్ 5, పోస్టుమార్టం అసిస్టెంట్ 6, ప్లంబర్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్ 6, ఎలక్ట్రీషియన్ 1 చొప్పున్న ఖాళీలున్నాయన్నారు. అర్హతతో పాటు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 15వతేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ శాఖల అవగాహన పోస్టర్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి సోమవారం ఆవిష్కరించారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న పీ3 పోస్టర్లను, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్లకోమా వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత వెనుకపడిన 20 శాతం కుటుంబాలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ4 కార్యక్రమం చేపడుతోందన్నారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్వో మోహన్ కుమార్, సాంబశివారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీబీసీఎస్ డాక్టర్ అర్పిత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుడికి వైఎస్సార్ సీపీ నేత పరామర్శ
వెదురుకుప్పం: మండలంలోని బలిజమొండివెంగనపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. భాస్కర్ తండ్రి శంకరయ్య సోమవారం వేకువజామున మృతి చెందారు. ఈ విషయం తెలసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, మాజీ ఎంపీపీ జ్ఞానమ్మ, వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం ఆ గ్రామానికి చేరుకుని, భా స్కర్‌ను పరామర్శించారు. అనంతరం శంకర య్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శివాజి, వెదురుకుప్పం మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డి, వెంకటేశ్, వాసు ఉన్నారు.
2 కిలోల గంజాయి స్వాధీనం
పుంగనూరు: పట్టణంలోని మేలుపట్లలో అక్రమంగా విక్రయిస్తున్న 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేలుపట్ల గ్రామానికి చెందిన బాలాజీ, భగత్‌సింగ్‌కాలనీకి చెందిన శివకుమార్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఇందులో శివకుమార్ పరారీ కాగా, బాలాజీ అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వైద్యవిధాన పరిషత్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment