ఒంటి..తుంటరి మళ్లీ వచ్చింది!
తమిళనాడు నుంచి వెనక్కి..
గుడిపాల: ఒంటరి ఏనుగు.. భలే తుంటరి.. తమిళనాడు ప్రాంతానికి వెళ్లినట్టే వెళ్లి 24 గంటలు గడవక ముందే మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేసింది. బుధవారం సాయంత్రం గుడిపాల మండలంలోని పల్లూరు గ్రామానికి సమీపంలో మకాం వేసింది. సాయంత్రం రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏనుగును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులు బాణసంచా పేల్చి అటవీప్రాంతంలోకి తరిమారు. రోడ్డు పక్కన ఎక్కువగా వరి, చెరుకు, మామిడి పంటలున్నాయి. రాత్రి వేళలో పంటను తినేందుకు ఒంటరి ఏనుగు రావచ్చని ఎవరూ కూడా రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లవద్దని పల్లూరు, పానాటూరు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరెడ్డి తెలిపారు. తూర్పు, పడమర అటవీశాఖ అధికారులు ప్రభాకర్‌రెడ్డి, మధు, ఢిల్లీరాణి, అరుణ ఏనుగు కదలికలపై కన్నేసి ఉంచారు.
ఒంటి..తుంటరి మళ్లీ వచ్చింది!
Comments
Please login to add a commentAdd a comment