● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించని కోచింగ్‌ సెంటర్‌ ● కూటమి ప్రభుత్వంలో బూటకపు మాటలు ● రాయలసీమకు అంతా ఒకేచోట కోచింగ్‌ ● ముడుపులు ఇచ్చిన వారికి ఆమోదం ! | - | Sakshi
Sakshi News home page

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించని కోచింగ్‌ సెంటర్‌ ● కూటమి ప్రభుత్వంలో బూటకపు మాటలు ● రాయలసీమకు అంతా ఒకేచోట కోచింగ్‌ ● ముడుపులు ఇచ్చిన వారికి ఆమోదం !

Published Fri, Mar 14 2025 1:54 AM | Last Updated on Fri, Mar 14 2025 1:49 AM

● ఆంద

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన

చిత్తూరు కలెక్టరేట్‌ : సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా చిత్తూరు. ఇది పేరుకు మాత్రమే.. సీఎం సొంత జిల్లాకు ఒరిగిందేమి లేదు. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. డీఎస్సీ పరీక్ష కోసం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 45 వేలకు పైగా అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో పేద అభ్యర్థులకు మంచి కోచింగ్‌ సెంటర్‌లలో డీఎస్సీ శిక్షణ ఇప్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరుస్తారని జిల్లా డీఎస్సీ అభ్యర్థులు ఎదురుచూశారు. పది నెలలుగా ఆ హామీ మాత్రం నెరవేరలేదు. తాజాగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో ఒక్క కోచింగ్‌ సెంటర్‌కు సైతం డీఎస్సీ శిక్షణకు అను మతి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై డీఎస్సీ అభ్యర్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

చిత్తూరు జిల్లా కేంద్రంలో డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు అర్హత ఉన్న కోచింగ్‌ సెంటర్‌ ఉన్నప్పటికీ...ఆ శిక్షణ సంస్థ దరఖాస్తులు చేసుకున్నా మంజూరు చేయకుండా ఆపేశారు. పోతేపోని జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వేరే కోచింగ్‌ సెంటర్‌లకు అనుమతులిచ్చారా అంటే అదీ లేదు.

జిల్లా వ్యాప్తంగా డీఎస్సీకి శిక్షణ పొందుతున్న పేద అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఒక్కో అభ్యర్థికి రూ.28 వేలు శిక్షణ రుసుం చెల్లిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఒక్క కోచింగ్‌ సెంటర్‌కు సైతం అనుమతివ్వకుండా మోసగించారు.

పక్క జిల్లాల్లో పోలీస్‌ ఉద్యోగాలకు కోచింగ్‌ ఇచ్చే పలు సెంటర్‌లకు డీఎస్సీ శిక్షణకు అనుమతులివ్వడంపై నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కోచింగ్‌ సెంటర్‌లను ఎంపిక చేయకుండా ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి అనుభవం లేని కోచింగ్‌ సెంటర్‌లకు అనుమతులివ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం కూటమి టీడీపీ ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ లింకుడ్‌ కోచింగ్‌ సెంటర్ల పేరుతో జరుగుతున్న మాయాజాలమని తెలుస్తోంది.

రాయలసీమ పరిధిలో ఒకే ఒక శిక్షణ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేస్తున్నట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఆ కేంద్రానికి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, ఇతర జిల్లాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది మహిళలున్నారు. మహిళలు అంత దూరం వెళ్లి శిక్షణ పొందాలంటే శ్రమతో కూడుకున్న పని అని వాపోతున్నారు. సీఎం తన సొంత జిల్లాతో పాటు, రాయలసీమలోని డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు.

కూటమి టీడీపీ ఇచ్చిన మాటను తప్పి డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతోంది. ప్రభుత్వం తరఫున కోచింగ్‌ ఇవ్వాలంటే కనీసం రెండు నోటిఫికేషన్‌లు కోచింగ్‌ ఇచ్చి, జీఎస్టీ ఏటా చెల్లించన వారై ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి రూ.50 లక్షల టర్నోవర్‌ ఉండి కనీసం ఒక్కో నోటిఫికేషన్‌లో వంద మంది ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలకు అర్హత ఉన్న కోచింగ్‌ కేంద్రం జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ ఎంపిక చేయకుండా ముడుపులు ఇవ్వలేదనే కారణంతో పక్కన పెట్టేశారు.

డీఎస్సీ శిక్షణకు ఆప్షన్‌లు నమోదు చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : డీఎస్సీ శిక్షణకు అభ్యర్థులు ఆప్షన్‌లు ఎంపిక చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయంతో డీఎస్సీ శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థుల నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో 1000 మంది అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌ను విడుదల చేశారన్నారు.

సంబంధిత అభ్యర్థులు ఎంపానెల్డ్‌ కోచింగ్‌ సంస్థల్లో వెబ్‌ ఆప్షన్‌లను నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికై న అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్‌లోని www.mdfc.apcfss.in లో ఈ నెల 15వ తేదీలోపు ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలని కోరారు.

విడ్డూరంగా ఉంది

డీఎస్సీ శిక్షణ పొందుతున్న వారిలో చిత్తూరు జిల్లాలో అధిక శాతం మంది మహిళలున్నారు. చిత్తూ రు జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారని అనుకున్నాం. అయితే చివరికి శిక్షణ కేంద్ర మే లేకుండా చేశారు. మహిళలు అనంతపురానికి వెళ్లి శిక్షణ ఎలా పొందేది. డీఎస్సీ నిరుద్యోగులకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. జిల్లా కేంద్రంలో అనుభవం ఉన్న కోచింగ్‌ సెంటర్‌కు అనుమతి ఇచ్చి శిక్షణ ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– ఉమామహేశ్వరి, డీఎస్సీ అభ్యర్థిని

రాయలసీమలో ఒకే ఒక కేంద్రం ఎంపిక

స్థానికంగా ఏర్పాటు చేయాలి

కూటమి టీడీపీ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా అంటే అలుసెందుకో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులకు ఆ మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవా. రాయలసీమ మొత్తానికి ఒక శిక్షణ కేంద్రం. అదీ అనంతపురంలో ఎంపిక చేయడం విడ్డూరంగా ఉంది. ఇదంతా చూస్తుంటే డీఎస్సీ అభ్యర్థులపై కక్ష సాధింపు దిశగానే చేస్తున్నారనిపిస్తోంది. ప్రభుత్వం చిత్తూరు జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ మొదలుపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– కోమల, డీఎస్సీ అభ్యర్థిని

దరఖాస్తు చేసుకున్నా..

లక్ష్యాన్ని నీరుగార్చి.. నిబంధనలకు నీళ్లు

ఉచిత కోచింగ్‌ పేరుతో నమ్మించి మోసం

No comments yet. Be the first to comment!
Add a comment
● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన1
1/3

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన2
2/3

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన3
3/3

● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement