భర్త కుటుంబీకులపై భార్య బంధువుల దాడి
పెద్దపంజాణి : భర్త కుటుంబీకులపై భార్య బంధువులు దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని మాదనపల్లి పంచాయతీ చింతలపల్లిలో గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌హెచ్‌ఓ మురళీరాజు కథనం మేరకు వివరాలు.. మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు గణేష్‌కు బైరెడ్డిపల్లి మండలం ఎర్రకదిరేపల్లి గ్రామానికి చెందిన రాజప్ప కుమార్తె జమునతో 5 ఏళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట జమున తన తమ్ముడికి ఆపరేషన్ అని చెప్పి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి భర్త గణేష్ ఫోన్ చేసినా ఇంత వరకూ అత్తగారింటికి రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీ మధ్యాహ్నం జమున బంధువులు కొంత మంది రౌడీలతో చింతలపల్లికి వచ్చి భర్త గణేష్ కుటుంబీకులతో మాట్లాడాలని చెప్పి వారిపై దాడి చేసి గాయపరిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం క్షతగాత్రులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గణేష్ తండ్రి శంకరప్ప ఫిర్యాదు మేరకు మంజుల, రాజప్ప, లక్ష్మీపతి, ప్రభాకర్, కవిత, సరసమ్మ, వికాస్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ చెప్పారు.
భర్త కుటుంబీకులపై భార్య బంధువుల దాడి
Comments
Please login to add a commentAdd a comment