ఆర్థిక అక్షరాస్యతకు కృషి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అక్షరాస్యత ఎంతో ముఖ్యమని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై కమ్యూనిటీ రీసోర్స్‌పర్సన్‌లకు శిక్షణ నిర్వహించారు. డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ స్వయం సంఘా ల సభ్యులు ఆర్థిక అక్షరాస్యత సాధించడానికి కృషి చేయాలన్నారు. సంఘం, అందులోని సభ్యు లకు ఆర్థిక ప్రణాళిక పొదుపు, ఆవశ్యకత, ఖర్చు లు చేసే అంశాలకు అవగాహన ముఖ్యమన్నా రు. రుణాలు పొందడం, డిజిటల్ లావాదేవీలు, సామాజిక భద్రత ఇన్సూరెన్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మైక్రో ఫైనాన్స్ సంస్థలను నియంత్రించి సంఘం సభ్యులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీ ష్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లు పాల్గొన్నారు.
12 మంది ఎస్‌ఐల బదిలీ
చిత్తూరు అర్బన్: జిల్లాలో 12 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ శనివారం ఉత్తర్వు లు జారీ చేశారు. వేకెంట్ రిజర్వులో (వీఆర్) ఉ న్న కొందరికి స్టేషన్లు కేటాయించారు. దాదాపు ఏడు నెలలకు పైగా ఖాళీగా ఉన్న పెనుమూరు స్టేషన్‌కు సైతం ఎస్‌ఐను నియమించారు. స్థానచలనం పొందిన ఎస్‌ఐల వివరాలు... వీఆర్‌లో ఉన్న ఇ.ఎర్రిస్వామిని చిత్తూరు వన్‌టౌన్, పి.వెంకటరమణ– చిత్తూరు టూటౌన్, బి.తులసన్న– చిత్తూరు సీసీఎస్, జి.రామచంద్రయ్య– పెనుమూరు, పి.విజయ్‌నాయక్– నగరి, ఎ.వెంకటనారాయణ– ఎన్‌ఆర్.పేట, కె.రంగ– విజయపురం, కె.వెంకటరమణ –పుంగనూరు, ఎన్.ధనంజయరెడ్డి –పంజాణి, చిత్తూరు టూటౌన్‌లో ఉ న్న ప్రసాద్‌ను బంగారుపాళ్యం, పంజాణిలో ఉ న్న బి.శ్రీదేవిని చిత్తూరు పోలీస్ కంట్రోల్ రూ మ్, విజయపురంలో ఉన్న కె.బలరామయ్యను చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేశా రు. ఈ క్రమంలోనే ఎన్‌ఆర్.పేటలో ఉన్న వెంకటసుబ్బమ్మ ఏపీ ట్రాన్స్‌కోకు బదిలీపై వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment