హుండీ లెక్కింపుపై విచారణ
– టెంపుల్ ఇన్‌స్పెక్టర్, ఈఓలపై భక్తుల ఫిర్యాదు
– విచారణ చేపట్టిన అసిస్టెంట్ కమిషనర్
పుత్తూరు: స్థానిక శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి, ఆరేటమ్మ ఆలయాల్లో చేపట్టిన హుండీలోని కానులక లెక్కింపులో దేవదాయశాఖ అధికారులు చేతివాటం చూపారన్న ఫిర్యాదుపై చిత్తూరు జిల్లా దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. సదాశివేశ్వరాలయంలోని హుండీల్లో భక్తులు గత ఏడాది జనవరి 3వ తేదీ నుంచి జూన్ 15 వరకు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,41 లక్షల ఆదాయం వచ్చింది. శనివారం నిర్వహించిన 9 నెలల్లో భక్తులు హుండీలో వేసిన కానుకల లెక్కింపులో రూ.2 లక్షలే వచ్చిందని టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సుమన ప్రియ, ఈఓ జయక్రిష్ణ నిర్ధారించారు. దీనిపై ఏసీ రామకృష్ణారెడ్డి లెక్కింపులో పాల్గొన్న వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారు. అలాగే ఫిర్యాదు చేసిన వారు రెండవ దఫా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి చేతివాటం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment