సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా! | - | Sakshi
Sakshi News home page

సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా!

Published Sun, Mar 23 2025 8:59 AM | Last Updated on Sun, Mar 23 2025 8:58 AM

సిబిల

సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా!

● బ్యాంకు రుణాలు అందడం గగనమే ● సిబిల్‌ స్కోర్‌లో పురుషుల కంటే మహిళలే టాపర్స్‌ ● జిల్లాలో 60శాతం మందిపై ప్రభావం

తిరుపతి సిటీ:ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు, ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు క్రెడిట్‌ కార్డు లు, రుణాలపై ప్రజలు ఆధార పడుతుంటారు. వీటిని పొందడంలో సిబిల్‌ స్కోర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. రుణాలిచ్చేటప్పుడు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను పరిగణలోకి తీసుకుంటాయి. దీంతో చాలామంది మూడంకెల సంఖ్యను మెరుగుపరుచుకోవడానికి ఆరాటపడుతుంటారు.

సిబిల్‌ స్కోర్‌ అంటే...

సిబిల్‌ స్కోర్‌ అంటే వ్యక్తి, సంస్థ, కంపెనీల క్రెడిట్‌ చరిత్రను గణనచేసేందుకు 2017లో రిజర్వు బ్యాంక్‌ అనుమతి పొందిన సంస్థ. క్రెడిట్‌ చరిత్రను తెలుసుకోవడానికి దేశంలో నాలుగు సంస్థలు ఉన్నాయి. అందులో ప్రధాన మైంది క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సీఐబీఐఎల్‌). దీనినే సిబిల్‌గా పిలుస్తుంటారు.

సిబిల్‌ స్కోర్‌ టాపర్స్‌ మహిళలే

జిల్లాలో రుణాలు తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషుల కంటే సీ్త్రలు తమ కంతుల చెల్లింపులలో అగ్రస్థానంలో ఉంటూ సీబిల్‌ స్కోర్‌ను కాపాడుకుంటున్నారు. జిల్లాలో సుమారు 91శాతం మంది మహిళలు 800ప్లస్‌ స్కోర్‌లో ఉన్నారంటే ఆతిసయోక్తికాదు.

సిబిల్‌ స్కోర్‌ ఆశాజనకంగా ఉంటే ప్రయోజనాలు ఇవే..

అవసరమైన వెంటనే రుణాలు తక్కువ వడ్డీతో ఎక్కువ రుణం

ష్యూరిటీలతో పని ఉండదు ఎక్కవ కాలపరిమితి గల రుణాలు

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు పొందడానికి హామీలతో పనిలేదు

క్యాష్‌ బ్యాక్‌ సౌకర్యం, ఎంపిక చేసిన కొనుగోళ్లపై రివార్డులు

ప్రీ అప్రూవ్డ్‌ రుణాల పేరుతో బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు స్వయంగా

రుణాలను అఫర్‌ చేస్తాయి.

సాధారణ బీమా పాలసీలకు ప్రీమియం తగ్గింపు

ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల నుంచి ప్రీమియం క్రెడిట్‌ కార్డులు

పొందే అవకాశం

సిబిల్‌ స్కోర్‌ పెంచుకోండి ఇలా

రుణాల చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపులు సకాలంలో చేయాలి

పాత బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులను కొనసాగించాలి.

క్రెడిట్‌ లిమిట్‌ను పూర్తిగా వాడేయొద్దు

పదేపదే రుణాలకు దరఖాస్తు చేయొద్దు

రుణాల చెల్లింపులో కంతులను సక్రమంగా చెల్లించాలి

జాయింట్‌ అకౌంట్లతో రుణాలను తీసుకోకపోవడం మంచిది.

అన్‌సెక్యూర్డ్‌ రుణాలను తక్కువ తీసుకోవాలి

ఒకే వ్యక్తి స్థోమతకు మించి ష్యూరిటీ లేని రుణాలను తీసుకోవద్దు

సిబిల్‌ స్కోర్‌తో అప్రమత్తంగా ఉండాలి

రుణగ్రస్తులు సిబిల్‌ స్కోర్‌ పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. జిల్లాలో సుమారు 60శాతం మంది రుణగ్రస్తులకు 550లోపు స్కోర్‌ ఉంది. సక్రమంగా రుణాల చెల్లించకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.– నరసింహస్వామి, పేరొందిన

ప్రభుత్వ బ్యాంక్‌ రిటైర్డ్‌ మేనేజర్‌, తిరుపతి

భవిష్యత్తుపై ప్రభావం

ప్రైవేటు, ప్రభుత్వ ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకులు రుణగ్రస్తుల అవసరాలకు రుణాలను మంజూరు చేస్తాయి. వాటిని గడువులోపు చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. లేనిపక్షంలో రుణగ్రస్తుని ఆర్థిక స్థితికి మించి అపరాధం కట్టుకోవాల్సి ఉంటుంది. – రవిచంద్రారెడ్డి, ప్రముఖ

ఫైన్సాన్‌ కంపెనీ, సేల్స్‌ మేనేజర్‌, తిరుపతి

సిబిల్‌ స్కోర్‌ తగ్గడానికి కారణాలు

ఆదాయానికి మించి రుణాలు పొందడం, రుణాల చెల్లింపులలో అలసత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి వారంలో సక్రమంగా వేతనాలు అందకపోవడం, రుణగ్రస్తులైన వ్యాపారుల ఆర్థికలావాదేవీలలో ఆలస్యం, ఆకస్మిక ఉద్యోగాల తొలగింపు, గ్రామీణ రైతుకు గిట్టుబాటు ధర అందకపోవడం వంటివి సిబిల్‌ స్కోర్‌ తగ్గడానికి ప్రధాన కారణాలు.

సిబిల్‌ స్కోర్‌ ఎంత ఉండాలంటే...

సాధారణంగా సీబిల్‌ స్కోర్‌ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 550 కంటే తక్కువ ఉంటే రుణాల మంజూరుకు బ్యాంకులు అనుమతించవు. 750నుంచి 900 అత్యుత్తమ స్కోర్‌, 650 నుంచి 750 ఉంటే మంచి స్కోర్‌, 550 నుంచి 650 యావరేజ్‌, 300 నుంచి 550 ఉంటే డేంజర్‌ స్కోర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా! 
1
1/2

సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా!

సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా! 
2
2/2

సిబిల్‌ స్కోర్‌ తగ్గితే భవిష్యత్‌ గోవిందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement