హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
చిత్తూరు అర్బన్: హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ సురేష్‌రెడ్డిని న్యాయశాఖ ఉద్యోగులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరుకు వచ్చిన న్యాయమూర్తిని జిల్లా జడ్జి భీమారావుతో కలిసి ఓ హోటల్‌లో బేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో న్యాయశా ఖ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు గోపీనాథ్‌రెడ్డి, స భ్యులు లక్ష్మీపతి, బాలసుందరం, రవీంద్రారె డ్డి, రాజేష్, హరికృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సంతోష్, దిలీప్, యువరాజ్, రెడ్డెప్ప, చంద్రశేఖర్, భ్రమ రాంబ, పవన కుమారి మినిమా పాల్గొన్నారు.
నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం
చిత్తూరు కార్పొరేషన్: కరెంటు బిల్లులను వినియోగదారులు ఆదివారం సైతం చెల్లించవచ్చని ట్రాన్స్‌కో చిత్తూరు, తిరుపతి జిల్లా ఎస్‌ఈలు ఇస్మాయిల్‌అహ్మద్, సురేంద్రనాయుడు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు పనిచేస్తాయని, వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పట్టా భూమి కబ్జా
● టీడీపీ నేతల అరాచకం
వడమాలపేట (విజయపురం ) : పట్టా భూమిని కబ్జా చేసి గుడిసెలు వేసిన సంఘటన వడమాలపేట మండలం, బాలనాయుడుకండ్రిగ పంచాయతీ ఎన్‌వీఆర్ కండ్రిగ ఆది ఆంధ్రవాడలో చోటు చేసుకొంది. వడమాలపేట మండలం ఎన్‌వీఆర్‌కండ్రిగ ఆదిఆంధ్రవాడ ఆనుకొని సర్వే నంబర్ 95–2ఎలో 0.73 సెంట్ల పట్టా భూమి ఉంది. దేవరాజులురెడ్డి భార్య వనజాక్షిపై రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారు. సుమారు 10 దశాబ్దాల నుంచి భూ యజమానులు అందులో సాగు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో, వెబ్ ల్యాండ్‌లో ఇది పట్టా భూమిగా, యజమానుల పేర్ల మీద ఉంది. కానీ స్థానికంగా ఉన్న ముగ్గురు టీడీపీ నేతలు శనివారం పట్టా భూమిని కబ్జా చేసి తన అనుచరులతో గుడిసెలు వేయించారు. విషయం తెలుసుకొన్న భూ యజమాని అక్కడికి వెళ్లగా టీడీపీ నాయకులు అతడిపై దాడికి పాల్పడినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది ఏమి లేక తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment