
ఇంట్లో చోరీ..
పలమనేరు పట్టణ సమీపంలోని ఓ ఇంటిలో రూ.2 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పలమనేరు : జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా వచ్చినా ముందుగా కూటమి నేతలకు చేరాల్సిందే. ఆపై మిగిలిన వాటిని అవసరం ఉన్న రైతులకు అందజేస్తున్నారు. రాయితీతో అందే విత్తనాలు, హార్టికల్చర్ ద్వారా అందే నర్సరీ నార్లు ఇలా రాయితీ పథకాలేవైనా ముందు తమ్ముళ్లకు ఆపైనే రైతులకనే విధంగా మారింది. దీంతో తటస్థంగా ఉన్న లేదా వైఎస్సార్‌సీపీ సానుభూతి రైతులకు వ్యవసాయ, ఉద్యానశాఖలకు సంబంధించిన రాయితీ పథకాలకు సూటిపోటి మాటలు, అవమానాలు తప్పడం లేదు.
రాయితీ పరికరాలకు నిబంధనలు ఇలా..
ఎస్‌ఎంఏఎం పథకంలో 17 శాతం ఎస్సీలు, 8 శాతం ఎస్టీలు మిగిలిన శాతం బీసీ, ఓసీలోని సన్న, చిన్నకారు రైతులకు అందివ్వాలి. గత ఐదేళ్లలో వ్యవసాయ పరికరాలను పొందని రైతులుగా ఉండాలి. ఆ మేరకు ఇప్పటికే పరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు ముందుగా ఆర్‌ఎస్‌కే లాగిన్ ఆపై ఏవో లాగిన్ నుంచి డీఏవో లాగిన్ ద్వారా ఎంపికలు జరుగుతాయి. ఎంపికై న రైతులు సంబంధిత పరికరం ధరలో 50 శాతం డబ్బును సంబంధిత కంపెనీకి చెల్లించి ఆ కంపెనీ ద్వారానే పరికరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
జాబితాలు కూటమి నేతల జేబుల్లోకి...
ఆన్‌లైన్‌లో నమోదైన లబ్ధిదారుల జాబితాలు ఆయా మండలాల్లోని పంచాయతీ స్థాయి నాయకుల జేబుల్లోకి ఇప్పటికే చేరాయి. వీటిని అధికారులు ఎందుకిచ్చారో ఎవరి ఆదేశాలతో ఇచ్చారో అర్థంకావడం లేదు. పారదర్శకంగా సాగాల్సిన వ్యసాయశాఖ పథకాల పంపిణీలో రాజకీయ జోక్యం నెలకొంది. జాబితా జేబులో పెట్టుకున్న కూటమి చోటా నేతలు లబ్ధిదారులను చూడగానే జాబితా ఉందన్నా ఇవ్వాలా వద్దా అనే మాట వినిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు రైతులు ఇదేమీ కర్మరా సామీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
యూరియా, సీడ్స్ ఏమొచ్చినా ముందుగా పచ్చనేతలకే..
పథకమేదైనా లిస్ట్ సంబంధిత లీడర్లకు ఇవ్వాల్సిందే
దరఖాస్తుదారుల జాబితా కూటమి నేతల జేబులో..
వ్యవసాయశాఖ రాయితీ పథకాల్లో సాగుతున్న తీరు
రూ.2.84 కోట్లతో 1645 రకాల పరికరాలు
చిత్తూరు జిల్లా వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో 2024–25 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎస్‌ఎంఏఎం( ది సబ్ మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్)లో రూ.2.84 కోట్ల నిధుల ద్వారా ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలైన మాన్యువల్ స్పేయర్లు, పవర్ స్పేయర్లు, ట్రాక్టర్ బెస్డ్ బూమ్‌టైప్ స్పేయర్లున్నాయి. ట్రాక్టర్ డ్రాన్ పరికరాల్లో కల్టివేటర్లు, డిస్క్‌పడల్స్, సీడ్‌కం ఫర్టిలైజర్ డ్రిల్స్ తదితరాలున్నాయి. ఇక సెల్ఫ్ ప్రొఫెల్లెడ్ పరికరాలు మొత్తం 1645 పరికరాలను జిల్లాలోని రైతులకు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాల్సి ఉంది.
– పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ కల్లాడుకు చెందిన ఓ రైతు మండలంలో ఆదర్శ రైతుగా ప్రభుత్వం చేత గతంలో గుర్తింపు పొందాడు. ఇటీవల వ్యవసాయశాఖ రాయితీ పరికరాల పథకంలో పవర్ స్పేయర్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. ఓ వైపు పరికరాల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. కానీ ఆన్‌లైన్‌లో నమోదైన పేర్లు అక్కడి అధికారుల నుంచి కూటమి నేతలకు చేరిపోయాయి. దీంతో వారు సంబంధిత రైతును చూసి ఏమన్నో స్పేయర్‌కోసం ఆన్‌లైన్‌లో నీపేరుంది.., ఎట్టా కావాల్నా ? అంటూ ఆ రైతును అడిగారు. ఈ విషయం వీళ్లకెలా తెలుసునని ఆ రైతు షాక్‌కు గురయ్యాడు.
ఏ పథకం వచ్చినా మొదట తమ్ముళ్ల కడుపు నిండుతోంది. తరువాతే మిగిలిన రైతులకు అందజేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఏ పథకానికి దరఖాస్తు చేసినా జాబితా నేరుగా సంబంధిత కూటమి నేతలకు చేరిపోతోంది. ఇంకేంముంది..పల్లెల్లో ఇక వారి సిఫార్సు ఉంటేనే పథకాలు అన్నదాతలకు అందుతాయి. మనసు చంపుకొని వారి వద్దకు వెళ్తేనే రాయితీ కానీ మరో పథకమైనా దక్కుతుంది..కూటమి పాలనలో పారదర్శకతకు పాతరేశారు..గతంలో వైఎస్సార్‌సీపీ పాలనలో కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా పథకానికి అర్హులైతే చాలు..ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించేవారు..నేడు పథకాలకు తమ్ముళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గాని అందని పరిస్థితులు దాపురించాయి.
విచారణ చేస్తాం..
పథకాలను అర్హులైన వారికి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు , యంత్రాల పంపిణీ కోసం ఆసక్తి గల రైతుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరాం. ఆయా పంచాయతీల్లో కూటమి నేతలకు లబ్ధిదారుల జాబితా ఎలా వెళ్లిందనే దానిపై విచారణ చేస్తాం. దీనిపై జిల్లా స్థాయిలో ఏఓలతో సృష్టమైన ఆదేశాలను ఇస్తాం. అర్హులైన రైతులకు పార్టీలతో సంబంధం లేకుండా సబ్సిడీ పరికరాలను అందజేస్తాం.
– మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి, చిత్తూరు

ఇంట్లో చోరీ..

ఇంట్లో చోరీ..

ఇంట్లో చోరీ..