
పూలే జయంతిని జయపద్రం చేయండి
చిత్తూరు కార్పొరేషన్: మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల ను జయప్రదం చేయా లని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. శుక్రవా రం జిల్లాలోని బీసీ, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నాలన్నారు. పూలే విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. బలహీన వర్గాల అభ్యు న్నతికి ఆయన చేసిన కృషిని తెలియజేయాలన్నారు.
ఐటీఐ పరీక్షలకు ప్రైవేట్‌గా హాజరు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్ తదితర ట్రేడ్‌లలో ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారని ప్ర భుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐటీఐలో కోర్సు పూర్తి చేసిన మా జీ శిక్షణార్థుల అనుబంధ ట్రేడ్‌కు ప్రైవేట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు అనుబంధ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి, ఫలితాల ప్రకటన తర్వాత కనీసం ఏడాది అనుభవం ఉండాలన్నారు. సీఓఈ పథకంలో ప్రస్తు తం శిక్షణార్థులుగా ఉండాలని తెలిపారు. ఎసీవీటీ అభ్యర్థులు (ఆగస్టు 2018 సెషన్ వరకు ప్రవేశం పొందిన వారు) అయి ఉండాలన్నారు. 2025 ఏప్రిల్11వ తేదీ నాటికి 21 ఏళ్లు పూర్తి అయ్యి, ఏదైనా సంస్థలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలో దరఖాస్తుతో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు. వివరాలకు 7799201479 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
సర్వర్ డౌన్
చిత్తూరు కార్పొరేషన్: రిజిస్ట్రేషన్‌శాఖ సర్వర్ డౌన్ కావడంతో డ్యాకుమెంటెషన్లు సక్రమంగా జరగలేదు. రెండు రోజులుగా సర్వర్ నెమ్మదిగా వస్తుండడంతో ఈసీ, రిజిస్ట్రేషన్, ఈ–కేవైసీ సేవలు స్తంభించాయి. దీంతో క్రయ, విక్రయదారులు కార్యాలయాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆగి ఆగి నెట్ రావడంతో విసుగు చెందారు. సర్వర్ వచ్చాక కార్యాలయానికి రావా లని డ్యాకుమెంటర్లు వారిని కార్యాలయం నుంచి పంపించారు. సాధారణంగా 40 వరకు జరిగే రిజిస్ట్రేషన్లు గురువారం మొత్తం 28 మాత్రమే జరిగాయి.
నేడు నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.
డీసీహెచ్‌ఎస్ పరిధిలో పోస్టుల ప్రొవిజనల్ మెరిట్‌లిస్ట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్(డీసీహెచ్‌ఎస్)లోని పలు పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిదేవి తెలిపారు. రెండు నెలల కిందట పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో వైద్యశాఖ నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్‌లిస్టును గురువారం సాయంత్రం ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. ఈ జాబితా కోసం www.chittoor.ap.gov.in లో చూసుకో వచ్చన్నారు. ఇందులో అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలని ఆమె పేర్కొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై దాడులు
చిత్తూరు రూరల్(కాణిపాకం): జి ల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖాధికారులు దాడులు చేశారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘ఇసుక తోడేళ్లు.. ఉచితం ముసుగులో లూటీకి తెగబడుతున్న పచ్చ ము ఠాలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వా రు స్పందించారు. పలమనేరు, తవణంపల్లి లోని ఇసుక అక్రమ కేంద్రాలపై తనిఖీలు చేప ట్టారు. అక్కడ తవ్వకాలను గుర్తించారు. సాక్షిదినపత్రికలో కథనం, అధికారులు తనిఖీల నే పథ్యంలో అక్రమ ఇసుక తవ్వకదారులు పరారయ్యారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ అక్రమ తవ్వకాలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. సమాచారం వచ్చిన వెంటే స్పందిస్తూ...చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇసుక అక్రమ రవణాకు సంబంధించి 2024–25 ఆర్థికసంవత్సరంలో రూ.7.20 లక్షల వరకు జరిమానా విధించామన్నారు.