
● ముస్లింల నిరసన
వక్ఫ్‌బోర్డు చట్టంరద్దు చేయండి
తిరుపతి మంగళం : దేశంలో ముస్లిం, మైనారిటీలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇందులో భాగంగానే వక్ఫ్‌బోర్డు చట్టం తీసుకొచ్చిందని వైఎస్సార్‌సీపీ ముస్లిం నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్‌ఖాదరీ, మహ్మద్‌కాసీమ్‌బాషా, షేక్ ఇమ్రాన్ బాషా ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ తిరుపతి మ హతి ఆడిటోరియం వద్ద ఉన్న పెద్ద మసీదు వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ ముస్లిం, మైనారిటీ నగర అధ్యక్షులు మహ్మద్ కాసీమ్‌బాషా(చోటాబాయ్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున వక్ఫ్‌బోర్డ్డు చ ట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టినట్టు తెలిపారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్ర భుత్వం ఆమోదించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది ముస్లింల భూములను కొట్టేసేందుకు కేంద్ర ప్రభు త్వం కుట్రలతో వక్ఫ్‌బోరు చట్టం ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు టీడీపీ జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చి ముస్లింలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ము స్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు వక్ఫ్‌బోర్డు బిల్లును వ్యతిరేకించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నిత్యం ముస్లింల సంక్షేమాన్ని ఆకాంక్షించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వక్ఫ్‌బోర్డ్ బిల్లును వ్యతిరేకించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముస్లిం నాయకులు ఖాదర్‌బాషా, గఫూర్, కజీర్, ఇస్మాయిల్, ముజాబింద్, జారీద్, మొదిసీన్, చాన్‌బాషా, అన్వర్, హాజి షేక్ ఫరీతాప్, షేక్ సలీమ్, ఎస్‌కె.కలీమ్, ఎస్. అమీర్‌బాషా పాల్గొన్నారు.
సముద్రంలోకి 440 తాబేళ్ల పిల్లలు
వాకాడు: మండలంలోని నవాబుపేట సముద్ర తీ రంలో సోమవారం ఫారెస్టు అధికారుల సమక్షంలో పిల్లలు ఉత్పత్తి చేసే ఆలీవ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను స ముద్రంలో విడిచి పెట్టారు. ఈ ఏడాది మూడో ద ఫా నవాబుపేట వద్ద ఉన్న తాబేళపిల్లల సంరక్షణా కేంద్రం(హేచరీ)లో దాదాపు 475 గుడ్లను సేకరించి పొదిగించారు. అందులో 440 పిల్లలు ఆరోగ్యంగా బయటకు రావడంంతో వాటిని సముద్రంలో విడిచి పెట్టారు. తాబేళ్లను చంపినా, వేటాడినా చట్టరీత్యా నేరమని ఫారెస్టు అధికారులు తెలిపారు.