
ప్రజలకు అండగా నిలబడదాం
నగరి : ప్రజలకు అండగా నిలబడి పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ సభ్యులు ఆర్కే రోజా పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయం వద్ద మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీడీ భాస్కర్, మున్సిపల్ పార్టీ ఉపాధ్యక్షుడు మునివేలు, ఏవీ పీతాంబరం, ప్రధాన కార్యదర్శులు శశికుమార్, తనికాచలం, నూర్ మహ్మద్, కార్యదర్శులు లోకనాథం, మేషాక్, ధనపాల్, చంద్రన్, షణ్ముగం, నాయకులు అయ్యప్ప, ఎల్లప్పరెడ్డి, మురుగ, ఆనంద్‌కుమార్, హమీద్, కన్నాయిరం, చంద్రబాబు, ఉమాపతి పాల్గొన్నారు.
ఈనెల 20 వరకు రేషన్
పంపిణీ పొడిగింపు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఈనెల 20వ తేదీ వరకు రేషన్ పంపిణీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్‌ఓ శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ జరిగిందన్నారు. మిగిలిన కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.