
పంటకు రక్ష.. భక్షకులకు శిక్ష
పలమనేరు: ప్రతి సమస్యకూ ఓ మార్గం ఉన్నట్టు ఓ రైతు తన మొక్కజొన్న తోటలో పిట్టలు, వానరాలను తరిమేందుకు ఓ వినూత్న ఆలోచన చేశారు. పాత రేకులతో భారీ శబ్ధాలు వచ్చేలా చేసి, నిశ్చింత అయ్యాడు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లికి చెందిన రైతు జగదీష్ తన పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం కంకులు ముదిరిన దశలో ఉన్నాయి. దీంతో పక్షులు, వానరాలు తోటలోకి వచ్చి రైతుకు నష్టం కలిగిస్తున్నాయి. దీన్ని గమనించిన కేకలు పెట్టినా అవి వెళ్లకపోవడంతో ఓ పాత ఇనుప రేకును వంచి దానికి ఓ తాడును కట్టాడు. ఇది గాలి వచ్చినప్పుడు రేకులు రాసుకుని శబ్ధం వచ్చేలా చేశారు. గాలి లేనప్పుడు రైతు రేకులకు కట్టిన ధారాన్ని లాగుతూ శబ్ధాన్ని పుట్టిస్తున్నాడు. దీంతో అతని మొక్కజొన్న తోటలోకి ఇప్పుడు పక్షులు, వానరాలు రాకుండా పోయాయి. రైతు ఐడియాను చూసిన జనం వారెవ్వా అంటున్నారు.