25 నుంచి ఉరుసు ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

25 నుంచి ఉరుసు ఉత్సవాలు

Published Sun, Apr 20 2025 2:23 AM | Last Updated on Sun, Apr 20 2025 2:23 AM

25 నుంచి ఉరుసు ఉత్సవాలు

25 నుంచి ఉరుసు ఉత్సవాలు

పుంగనూరు : పట్టణంలోని చెరువు కట్టపై గల హజరత్‌ సయ్యద్‌ నూర్‌షావలిబాబా ఉరుసు ఈనెల 25న ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్లు , కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 25న గంధం, 27న ఖవ్వాలి, 28న తహలీల్‌ ఫాతేహా నిర్వహిస్తారు. ఈ మేరకు దర్గాను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఎన్‌ఎస్‌.పేటలోని కళాశాల మైదానంలో ఉరుసు సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉరుసు కార్యక్రమానికి వేల మంది ప్రజలు రానుండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ లోకేష్‌ ట్రాఫిక్‌ ఏర్పాట్లు , పార్కింగ్‌పై కమిటీ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement