
ఏటా దిగుబడి 5,47,320 టన్నులు
రుచికి, పోషకాలకు మామిడి పెట్టింది పేరు.
అందుకే ఇది పండ్లల్లో రారాజుగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏటా మామిడి వినియోగం తగ్గిపోతుండడం
ఆందోళన కలిగిస్తోంది. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ మోజులో పడి యువత మామిడి రుచిని
ఆస్వాదించలేకవడం ఒక విధంగా అవగాహనా
రాహిత్యమేనని వైద్యనిపుణులు
హెచ్చరిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల
స్థాయి నుంచే మామిడి వినియోగంపై
అవగాహన పెంచాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వం ఆ దిశగా చర్యలు
చేపట్టాలని కోరుతున్నారు.
రైతుల సంఖ్య
80 వేల మంది
మామిడిని ట్రేలకు ఎత్తుతున్న వ్యాపారులు
కాణిపాకం: మామిడి సాగు సంక్షోభంలో చిక్కుకుపోయింది. మామిడి గుజ్జుకు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. గత ఏడాది వివిధ ఫ్యాక్టరీలు 2.75 లక్షల టన్నుల మామిడి గుజ్జును తయారు చేసి నిల్వ చేశాయి. ఈ గుజ్జు అత్యధికంగా యూరఫ్ దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ అక్కడ యుద్ధాల కారణంగా గతేడాది నుంచి గుజ్జు ఎగుమతులు స్తంభించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మేర గుజ్జు ఎగుమతి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మామిడి గుజ్జు కిలో రూ.60 నుంచి రూ.65 వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.36 పలుకుతోంది. దీంతో ఏంచేయాలో తెలియక రైతులు.. పరిశ్రమల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడిలో అధిక పోషకాలు ఉన్నాయని, దీని వినియోగం పెరిగితే అటు రైతుకు.. ఇటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
కూల్‌డ్రింక్స్‌తో ప్రమాదం
కూల్‌డ్రింక్స్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. చిన్న పాటి ఫంక్షన్ నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల వరకు భారీ స్థాయిలో కూల్‌డ్రింక్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కూల్‌డ్రింక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా పెద్దపెద్ద మాల్స్‌లో కూల్‌డ్రింక్స్‌ను ఆఫర్ల పేరుతో అమ్మేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందని చాలా మంది కూల్‌డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి తాగడం వల్ల అజీర్ణం, వాంతులు, అధిక బరువు, డయాబెటిక్, ఫ్యాటీ లివర్, గుండె, కీళ్ల సమస్యలు, పంటి సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామిడితో ఉపయోగాలెన్నో
మామిడి పండ్లు, జ్యూస్‌లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్–సీ, పైబర్ శరీరంలోని హానిచేసే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలను, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దంతాలు శభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. మామిడి మంచి జీర్ణకారి. సహజమైన బరువు పెంచేందుకు దోహదం చేస్తోంది. మామిడి రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బు రాకుండా కాపాడుతాయి. వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
● జిల్లాలో విస్తారంగా మామిడి సాగు
● యూరప్‌లో యుద్ధాల కారణంగా అమ్ముడుపోని గుజ్జు
● ఆపసోపాలు పడుతున్న అన్నదాతలు
● స్థానికంగానే వినియోగం
పెంచాలంటున్న వైద్య నిపుణులు
మామిడిని గ్రేడింగ్ చేస్తున్న సిబ్బంది
ఎనర్జీ డ్రింక్‌ల మోజులో పడొద్దు
యువత ఎక్కువగా ఎనర్జీ డ్రింక్‌ల మోజులో పడుతోంది. కిక్ అంటూ వెంటపడుతున్నారు. అయితే దాని వల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారు. కాలేజీలు, పాఠశాలల్లో పండ్ల రసాల వినియోగంపై అవగాహన పెంచాలి. ఎనర్జీ డ్రింక్స్‌లు తాగితే వచ్చే అనర్థాలను వివరించాలి. –గోవర్దన్‌బాబి,
మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమలశాఖ జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు
మామిడి ఆరోగ్యానికి మంచిది
మామిడి రసం, పండ్లల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే బీట కెరాటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ కావాల్సినంత ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎనర్జీ పెంచుతుంది. బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎక్కువగా తీసుకోవచ్చు. కంటి చూపునకు మేలు చేసే గుణాలు మ్యాంగోలో అధికం.
– సునీతాదేవి, చీఫ్ డైటీషియన్, స్విమ్స్, తిరుపతి

ఏటా దిగుబడి 5,47,320 టన్నులు

ఏటా దిగుబడి 5,47,320 టన్నులు

ఏటా దిగుబడి 5,47,320 టన్నులు

ఏటా దిగుబడి 5,47,320 టన్నులు