
సాక్షి, గుంటూరు: భార్యాభర్తల పరస్పర కేసులు గుంటూరులో కలకలం రేపాయి. వివరాల్లోకెళ్తే.. దిలీప్, సౌమ్య అనే ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తమ కుమార్తెను బలవంతగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు అత్తమామలు కేసు పెట్టారు. అంతేగాక.. తమ కుమార్తెను వదిలేయకపోతే ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని అత్తమామలు హెచ్చరించినట్లు దిలీప్ పేర్కొంటున్నాడు. ఈ చర్యపై దిలీప్ జిల్లా ఎస్పీని కలిసి అత్తమామలపై ఫిర్యాదు చేశాడు.(విషాదం: కొడుకు వీడియో తీస్తుండగానే..)