
సాక్షి, తిరుపతి: వివాహిత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలు భువనేశ్వరిని భర్త శ్రీకాంత్ రెడ్డే హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్య అనంతరం రుయా ఆస్పత్రి వెనుక ముళ్లపొదల్లో పెట్రోలు పోసి తగలపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఏడాదిన్నర కూతురుతో కలిసి పరారయినట్లు పేర్కొన్నారు.
అయితే హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు రెండు బృందాల గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్రీకాంత్.. 3 నెలల క్రితమే హైదరాబాద్ నుంచి తిరుపతికి మకాం మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment