సాక్షి, రేణిగుంట: రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ప్రైవేటు లాడ్జీలో వేర్వేరు గదుల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. అర్బన్ సీఐ అంజూయాదవ్ కథనం.. తిరుపతికి చెందిన అనిత(31), పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటేష్ (35)13 ఏళ్లుగా తిరుపతి సత్యనారాయణపురంలో సహజీవనం చేస్తున్నారు. తోపుడు బండిని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట వీరు రేణిగుంటలోని ఒకే లాడ్జీలో వేర్వేరు గదులను అద్దెకు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆ గదులను తట్టినా తెరవకపోవడంతో లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా, ఒక గదిలో అనిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని, మరో గదిలో వెంకటేష్ బెడ్‌పై విగతజీవిగా పడి మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్‌వీ వైద్య కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి:
అమెరికాలో కాల్పుల కలకలం: 8 మంది మృతి
అతనితో పెళ్లి జరిపించాలి.. లేకపోతే చచ్చిపోతా
Comments
Please login to add a commentAdd a comment