Private lodge
-
సహజీవనం: ప్రైవేటు లాడ్జీలో ఆత్మహత్య
సాక్షి, రేణిగుంట: రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ప్రైవేటు లాడ్జీలో వేర్వేరు గదుల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. అర్బన్ సీఐ అంజూయాదవ్ కథనం.. తిరుపతికి చెందిన అనిత(31), పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటేష్ (35)13 ఏళ్లుగా తిరుపతి సత్యనారాయణపురంలో సహజీవనం చేస్తున్నారు. తోపుడు బండిని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట వీరు రేణిగుంటలోని ఒకే లాడ్జీలో వేర్వేరు గదులను అద్దెకు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆ గదులను తట్టినా తెరవకపోవడంతో లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా, ఒక గదిలో అనిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని, మరో గదిలో వెంకటేష్ బెడ్‌పై విగతజీవిగా పడి మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం: 8 మంది మృతి అతనితో పెళ్లి జరిపించాలి.. లేకపోతే చచ్చిపోతా -
ప్రేమ జంటను దాచాడని దాడి
మదనపల్లె క్రైం : ప్రేమజంటను దాచిపెట్టాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని ఇద్దరు చితకబాదారు. ఈ సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు.. త్యాగరాజవీధికి చెందిన రామాంజులు(38) ఓ ప్రైవేటు లాడ్జిలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని చిన్నా న్న శంకర కుమారుడు కార్తీక్ తిరుపతికి చెందిన ఓ ప్రేమజంటను మదనపల్లెకు తీసుకొచ్చాడు. వాళ్లిద్దరూ ఎక్కడున్నదీ తెలియలేదు. రామాంజులే వారిని దాచిపెట్టాడని తిరుపతి నుంచి వచ్చిన టీటీడీ ఉద్యోగి రామచంద్ర, ఇతని బంధువు శివశంకర భావించారు. ఈ మేరకు రామాంజులును ప్రశ్నిం చారు. తనకు తెలియదని చెప్పినా వినకుండా చితకబాదారు. బాధితుడు ఆస్పత్రికి చేరుకున్నాడు. తనను కొట్టారని గట్టిగా అరుస్తుండడంతో కార్తీక్ తండ్రి శంకర, మరికొందరు అక్కడికి చేరుకుని అతడిని మాట్లాడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చికిత్స చేసుకునేందుకు కూడా ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో వదిలేశారు. బాధితుడు చికిత్స చేయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకటో పట్టణ పోలీసులు కేసు విచారిస్తున్నారు.