ప్రేమ జంటను దాచాడని దాడి | Love couple hid the attack | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటను దాచాడని దాడి

Published Sun, Oct 5 2014 4:12 AM | Last Updated on Sat, Aug 25 2018 7:26 PM

Love couple hid the attack

మదనపల్లె క్రైం : ప్రేమజంటను దాచిపెట్టాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని ఇద్దరు చితకబాదారు.  ఈ సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు.. త్యాగరాజవీధికి చెందిన రామాంజులు(38) ఓ ప్రైవేటు లాడ్జిలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని చిన్నా న్న శంకర కుమారుడు కార్తీక్ తిరుపతికి చెందిన ఓ ప్రేమజంటను మదనపల్లెకు తీసుకొచ్చాడు. వాళ్లిద్దరూ ఎక్కడున్నదీ తెలియలేదు. రామాంజులే వారిని దాచిపెట్టాడని తిరుపతి నుంచి వచ్చిన టీటీడీ ఉద్యోగి రామచంద్ర, ఇతని బంధువు శివశంకర భావించారు.

ఈ మేరకు రామాంజులును ప్రశ్నిం చారు. తనకు తెలియదని చెప్పినా వినకుండా చితకబాదారు. బాధితుడు ఆస్పత్రికి చేరుకున్నాడు. తనను కొట్టారని గట్టిగా అరుస్తుండడంతో కార్తీక్ తండ్రి శంకర, మరికొందరు అక్కడికి చేరుకుని అతడిని మాట్లాడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చికిత్స చేసుకునేందుకు కూడా ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో వదిలేశారు. బాధితుడు చికిత్స చేయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకటో పట్టణ పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement