
సాక్షి, ప్రకాశం జిల్లా: వేటపాలెం మండలం కఠారివారిపాలెంలో మరోసారి మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. వాడరేవు మత్స్య కారులు బల్ల వలలు వాడుతున్నారని ఓ పడవని కఠారివారిపాలెం మత్స్యకారులు పట్టుకున్నారు. తమ వారిని పట్టుకుని నిర్భందించడంపై వాడరేవు మత్స్యకారులు ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సముద్రంలో చేపల వేటకి బల్ల వలలు వినియోగంపై గత కొంత కాలంగా మత్స్యకార గ్రామాల మధ్య వివాదం జరుగుతోంది. (చదవండి: భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..)
సమస్య పరిష్కారం కోసం కఠారివారిపాలెంలో మత్స్యకారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అధికారుల మాట పట్టించుకోకుండా వాడరేవు మత్స్యకారుల బోటును కఠారివారిపాలెం మత్స్యకారులు తీరానికి తెచ్చారు. ఇది ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పై కూడా దాడి చేశారు. (చదవండి: కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య)
Comments
Please login to add a commentAdd a comment