ప్రతీకాత్మక చిత్రం
బొండపల్లి(ఒరిస్సా): జీవితాంతం రక్షణగా ఉండాల్సిన కన్నతండ్రే మానవ సంబంధాలను తుంగలో తొక్కేశాడు. కన్నబిడ్డపైనే లైంగిక దాడికి పాల్పడి సభ్య సమాజం నివ్వెరపోయేలా చేశాడు. ఇంతటి ఘనకార్యం చేసిన ఆ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బొండపల్లి మండలం వెదురువాడ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి కన్న కూతురిపై మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మేనత్త ఇంటికి వెళదామని చెప్పి కూతుర్ని మోటారు సైకిల్‌పై తీసుకెళ్తూ మార్గమధ్యంలో ఒకసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇంకోసారి కాలేజీ పని మీద వెళ్లాలంటూ తీసుకెళ్లి మార్గమధ్యంలో లైంగిక దాడి చేశాడు. పదో తరగతి చదువుతున్న ఆ బాలిక ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటోంది. రెండు రోజుల క్రితం కూడా పోడు వ్యవసాయం కోసం పొలానికి వెళ్దామని కూతురిని రమ్మన్నాడు. తండ్రి ఎందుకు రమ్మంటున్నాడో తెలుసుకున్న ఆమె నిరాకరించింది. చంపేస్తానని తండ్రి బెదిరించడంతో రాయితో కొట్టి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లకుండా 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో, అత్యాచారం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment