
సాక్షి, విశాఖపట్నం: బంగారం అక్రమ రవాణా అవుతుందన్న పక్కా సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్‌ఐ)అధికారులు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్సప్రెస్‌లో 3.98కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన బంగారం విలువ రూ.1.91కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
చదవండి: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు
బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి కోల్‌కతాలో ఆభరణాల రూపంలో అమర్చి అక్రమ రవాణా చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ యాక్ట్-1962 ప్రకారం బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు.