
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై దుండగులు కాల్పులు జరిపారు. తూటాలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు కొద్దిసేపటి ముందు ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంట తీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం..
Comments
Please login to add a commentAdd a comment