![Husband Assassination Attempt On Wife Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/18/Untitled-4.jpg.webp?itok=UmD0fhNv)
ప్రతీకాత్మక చిత్రం
తుమకూరు(బెంగుళూరు): ఓ భర్త భార్య కాళ్లు నరికి హత్యాయత్నం చేసిన ఘటన తుమకూరు నగరంలో కలకలం రేగింది. వివరాలు... గదగ్‌కు చెందిన బాబు, తుమకూరు మధుగిరికి చెందిన అనిత (30)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని విడివిడిగా ఉంటున్నారు. ఇదే సమయంలో హత్య పథకం రచించాడు. గురువారం ఉదయం గదగ్ నుంచి బాబు తుమకూరు చేరుకున్నాడు. (చదవండి: పెళ్లైన నెలకే భర్తకి షాక్.. ప్రియుడితో కలిసి.. )
అనితను కూడా పిలిపించాడు. ఇద్దరు ఓ హోటల్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఓ లాడ్జ్ వద్ద ఉన్న ఓ నిర్జన ప్రదేశంలోకి చేరుకున్నారు. అక్కడ గొడవపడ్డారు. పథకం ప్రకారం తీసుకువచ్చిన కత్తి తీసుకుని ఆమె కాళ్లు నరికాడు. అక్కడి నుంచి ఓ హోటల్‌కు వెళ్లి విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. భార్య మరొకరితో వివాహేతర సంబంధాన్ని తట్టుకోలే ఇలా చేశానని బాబు పోలీసులకు వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment