Husband Assassination Wife Due To Extramarital Affair - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. వద్దని ఎంత నచ్చచెప్పినా.. చివరికి..

Published Wed, Dec 8 2021 4:33 PM | Last Updated on Wed, Dec 8 2021 5:01 PM

Husband Assassination Wife Due To Extramarital Affair - Sakshi

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న గుత్తి సీఐ శ్యామారావు

గుత్తి(అనంతపురం జిల్లా): వివాహేతర సంబంధం మంది కాదని ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో చివరకు తన భార్యను హతమార్చాల్సి వచ్చిందని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. వివరాలను గుత్తి పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్యామారావు వెల్లడించారు. గుత్తి మండలం ఊటకల్లుకు చెందిన జగ్గలేటి జనార్దనయ్యకు తొమ్మిదేళ్ల క్రితం యాడికి మండలం పెద్దపేటకు చెందిన నీలావతి అలియాస్‌ రాజేశ్వరితో వివాహమైంది. పెళ్లైన మూడు నెలలకే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం జనార్దనయ్యకు తెలిసింది.

చదవండి: ఏం కష్టం వచ్చిందో పాపం.. బిడ్డలను అనాథలు చేసింది 

ఈ విషయంగా భార్యను మందలించి, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. ఐదారు సార్లు ఇరువైపులా పెద్దలు పంచాయితీ పెట్టి సర్దిచెప్పారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య కోసం జనార్దనయ్య గాలిం, ఈ నెల 5న ఉదయం ఇంటికి పిలుచుకుని వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భర్త మాటలు ఆమెకు రుచించలేదు.

పైగా అతనితో గొడవకు దిగింది. వరకు సహనం కోల్పోయిన జనార్దనయ్య... నీలావతి వేసుకున్న చున్నీతోనే ఆమె గొంతు బిగిం హతమార్చి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం గుత్తిఆర్‌ఎస్‌లోని రైల్వే బుకింగ్‌ కార్యాలయం వద్ద తచ్చాడుతున్న జనార్దనయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని రివండ్‌కు తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement