
సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేటలో కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన రామాంజనేయులు హత్యకు గురయ్యాడు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలలో రామాంజనేయులు మృతదేహం లభ్యమైంది. రామాంజనేయుల్ని చంపిన దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి హైవేలో ఓ బ్రిడ్జి కింద పడేశారు.
కళ్యాణ్ జ్యువలరీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న రామాంజనేయుల్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అయితే బాజీ, అన్నవరపు కిషోర్‌లే తన భర్తను చంపారని రామాంజనేయులు భార్య ఆరోపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామాంజనేయులు కిడ్నాప్ ఉపయోగించిన ఆటోను గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను విజువల్స్ ద్వారా మొత్తం ఐదుగురు కిడ్నాప్‌కు పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment