
వీడియో దృశ్యం
చెన్నై : పట్టపగలు జనం చూస్తుండగా ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన 30 ఏళ్ల రామ్‌కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడు రోడ్డు పక్క నిలబడి ఉండగా నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అతడితో కొద్దిసేపు మాట్లాడారు. ఏమైందో ఏమో వారిలోని ఓ వ్యక్తి కత్తితో రామ్ కుమార్‌పై దాడి చేశాడు. అనంతరం ఆ నలుగురు వ్యక్తులు అక్కడినుంచి పారిపోయారు.
తీవ్రంగా గాయపడ్డ రామ్‌కుమార్ సంఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment