దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే ఆక్రోశంతో అత్తపై అల్లుడు దాడి చేసిన సంఘటన నెలమంగల తాలూకా బిల్లినకోటె గ్రామంలో చోటుచేసుకుంది. అత్త సరస్వతమ్మపై అల్లుడు శ్రీరామ్ దాడి చేసాడు. సరస్వతమ్మ కూతురిని శ్రీరామ్ వివాహం చేసుకున్నాడు. శనివారం రాత్రి శ్రీరామ్ అత్తను ఖర్చులకు రూ.10 వేలు డబ్బులు అడిగాడు. అయితే సరస్వతమ్మ 500 ఇస్తానని చెప్పడంతో కొడవలితో దాడి చేసి గాయపరిచాడు.
బీమా కంపెనీపై ఫిర్యాదు
హుబ్లీ: ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై నళగుంద మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఎస్.కోనరెడ్డి గోకుల్‌రోడ్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం ఇవ్వాలి, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30 వరకు బీమా చెల్లించడానికి అవకాశం ఉన్నా, ఆ కంపెనీ మాత్రం నవంబర్ 20 వరకు మాత్రమే పరిహారం ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులను వంచించడమేనని అన్నారు. సదరు కంపెనీపై చట్టపరమైన విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment