
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : రామనాథపురంలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోగా గర్భిణి భార్యను కాపాడిన యువకుడు శిథిలాల్లో చిక్కుకుని మృతిచెందాడు. రామనాథపురం ఎంజీఆర్ నగర్‌కు చెందిన షణ్ముగరాజ్ (24). ఇతని భార్య సంగీత నాలుగు నెలల గర్భిణి. రామనాథపురంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. వర్షానికి షణ్ముగరాజ్ సహా ముగ్గురి పెంకుటిళ్లు హఠాత్తుగా కూలాయి. ఈ శబ్ధం విని పైకి లేచిన షణ్ముగరాజ్ భార్య సంగీతను ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు. తను బయటకు వచ్చే లోపు కప్పు కుప్పకూలింది. ఈ శిథిలాల్లో చిక్కుకుని షణ్ముగరాజ్ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment