ప్రేమ పెళ్లి చేసుకుంది.. తల్లిదండ్రులు వచ్చేసరికి.. | Man Ends Life Due To Lover Went With Parents After Marriage Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకుంది.. తల్లిదండ్రులు వచ్చేసరికి..

Published Sun, Jan 2 2022 5:01 AM | Last Updated on Sun, Jan 2 2022 5:38 AM

Man Ends Life  Due To Lover Went With Parents After Marriage Tamilnadu - Sakshi

తిరువొత్తియూరు: వధూవరులుగా తంజావూరు పోలీస్‌ స్టేషన్‌లో ఆశ్రయం కోరిన ప్రేమజంట పరిస్థితి చివరికి విషాదంగా మారింది. వివరాలు.. విల్లుపురం  వలవుర్‌ ప్రాంతానికి చెందిన వెట్రివేల్‌ (20) కార్‌ డ్రైవర్‌. ఇతను అదే ప్రాంతానికి చెందిన ధరణిని ప్రేమించాడు. ధరణి తల్లిదండ్రులు వీరి ప్రేమను వ్యతిరేకించారు. దీంతో కొన్నిరోజులకు ముందు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రేమ జంట తిరువందిపురం ఆలయంలో వివాహం చేసుకున్నారు.

తర్వాత తల్లిదండ్రుల నుంచి అపాయం ఉందని తెలియడంతో విల్లుపురం ఎస్పీ కార్యాలయంలో వధూవరులుగా ఆశ్రయం కోరారు. అయితే విచారణ సమయంలో వధువు ధరణి తన తల్లిదండ్రులతో కలసి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర వేదనకు గురైన వెట్రివేల్‌ శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు అతని మృతదేహాన్ని ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement