
మీడియాతో వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారి పర్వేంద్ర మహేలా
జైపూర్ : బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని తీవ్రంగా చితక బాదటమే కాకుండా, బలవంతంగా అతడితో మలం తినిపించారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆసల్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, ధోల్‌పూర్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి కొన్ని వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 25వ తేదీన దీపక్‌పై దాదాపు ఎనిమిది మంది దాడికి పాల్పడ్డారు. ( కోడలిపై అఘాయిత్యం: నిలదీసిన కొడుకును..)
విచక్షణా రహితంగా చితకబాది, అతడి చేత మలం తినిపించారు. దీనిపై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలిక కుటుంబం ఇది వరకే అతడిపై ఫిర్యాదు చేసిందని, దానిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment