![Man Killed His Wife Found Illegal Immigrant From Bangladesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/30/beng.jpg.webp?itok=58BOzqCC)
సాక్షి, బనశంకరి: నగరంలో సుద్దగుంటెపాళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య నాజ్‌ను హత్య చేసిన భర్త నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవాడని దర్యాప్తులో తేలింది. ఈ నెల 16 తేదీ తావరకెరె సుభాష్‌నగర ఇంట్లో భార్య నాజ్‌ను గొంతు పిసికి చంపి విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయాడు. పోలీసులు గాలించి అతన్ని అరెస్టు చేశారు. ఇతడు భారతీయుడు కాదని వెల్లడైంది. ఇతడు బంగ్లాదేశ్‌లోని ఢాకావాసి.
నాలుగేళ్ల కిందట బెంగళూరుకు
ఎలాంటి డిగ్రీ లేదు, కానీ మొబైల్, కంప్యూటర్ హార్డ్‌వేర్ మరమ్మతుల్లో శిక్షణ పొందాడు. సిలిగురి ద్వారా కోల్‌కతాకు వచ్చి అక్కడ నకిలీ ఆధార్ ఇతర పత్రాలు సంపాదించాడు. ముంబై, ఢిల్లీలో కొన్నాళ్లు పనిచేశాడు. 2019లో బెంగళూరుకు చేరుకుని ప్రముఖ ఐటీ కంపెనీలో చేరి నెలకు రూ.75 వేలు జీతం తీసుకునేవాడు. బెంగళూరులో నాజ్ అనే యువతిని పెళ్లి చేసుకోగా ఆమె 5 నెలల గర్భవతి.
అనుమానంతో సైకోగా మారి ఆమెను హతమార్చాడని ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా తెలిపారు. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని అనుకున్నాడు. పోలీసుల కళ్లుగప్పడానికి తన పేరుతో రెండు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఏడుమంది ఎస్పీలతో నిరంతరం సంప్రదిస్తూ పశ్చిమబెంగాల్ ఇస్లాంపుర వద్ద నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
(చదవండి: తారకరత్నకు మెలెనా! అరుదైన ఈ వ్యాధి గురించి తెలుసా.. ?)
Comments
Please login to add a commentAdd a comment