
లక్నో : ప్రియురాలి మాటలు విని ఆమెకు కాబోయే భర్తను దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోహన్‌లాల్‌గంజ్‌కు చెందిన షానే అలి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే సదరు యువతి కుటుంబం ఆమెకు బంథ్రకు చెందిన షాహబుద్దిన్‌తో వివాహం నిశ్చయించింది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి షాహబుద్దిన్ అడ్డుతొలగించమని ప్రియుడ్ని కోరింది. దీంతో షానే అలి, షాహబుద్దిన్‌ను చంపటానికి పథకం వేశాడు.
మార్చి 11వ తేదీన యువతి బర్త్‌డే పార్టీలో పాల్గొనటానికి వచ్చిన అతడ్ని స్నేహితుల సహాయంతో పొడిచి, కుక్క బెల్టుతో మెడ బిగించి చంపేశాడు. అనంతరం బాబు ఖెర గ్రామంలో మృత దేహాన్ని పడేశాడు. పోలీసులు షాహబుద్దిన్ హత్యకు సంబంధించి యువతిని విచారించారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించినప్పటికి, తర్వాత తన ప్రియుడే మృతుడ్ని చంపేసినట్లు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment