
డాక్టర్ ఎన్‌ఎస్ రాజు
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): కోవిడ్ వ్యాక్సిన్‌లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జీ కొండూరు మండలం లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఎన్‌ఎస్ రాజు నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ హెల్ప్‌లైన్ 104లో డిప్యూ టేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో సత్యనారాయణపురం, మత్యాలంపాడు ప్రాంతాల్లో కారులోనే వ్యాక్సిన్‌లు వేస్తూ రూ.600 నుంచి రూ.1000 వరకూ వసూలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సత్యనారాయణపురంలోని ఓ భవనంలో వ్యాక్సిన్ వేస్తున్నట్టు సమాచారం అందడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శీరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ బాలమురళీకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వైద్యాధికారితో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు. భవనంలోని స్టోర్ రూంలో భద్రపర్చిన సిరెంజిలు, 5 కోవాగి్జన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment