
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): కామారెడ్డిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో గల కౌసల్య ఆస్పత్రి యజమాని సిద్దిరాములును పోలీసులు గురువారం ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తుండగా, ఈ నెల 15న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యం లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన వైద్యశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సెక్షన్ 312, 420,23 ప్రకారం ఆస్పత్రిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆస్పత్రి నిర్వాహకుడు నడిపి సిద్దిరాములును గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో మధుసూదన్ తెలిపారు. వైద్యఅర్హత, అనుమతులు లేకుండానే ఆస్పత్రి నిర్వహించడంతో పాటు అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నందుకు గాను అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment